ప్రాంతీయం

ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి

65 Views

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి తెలిపారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలుచేస్తామని శాసనసభలో కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. విద్య, ఉద్యోగ, ఇతర రంగాల్లో ఉపకులాలకు ప్రయోజనం చేకూరేలా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ అమలుపై అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేయడం శుభ పరిణామం అన్నారు. సీఎం అసెంబ్లీలో చెప్పినట్లుగా ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతోన్న ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కూడా మాదిగ, మాదిగ ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka