ప్రాంతీయం

జగదాంబ రైస్ ఇండస్ట్రీస్ ను ప్రారంభించిన – మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

107 Views

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో రికార్డ్ స్థాయిలో దిగుబడులు సాధిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని మెదక్ పార్లమెంటు సభ్యులు సిద్దిపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాయపోల్ మండలంలోని కొత్తపల్లి పరిధిలో నూతనంగా నిర్మించిన జగదాంబ ఇండస్ట్రీస్ ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ ప్రారంభించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు సాగునీటి వసతి కల్పన, రైతు బంధు పథకం, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి వాటిని ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలుస్తున్నారని అని ఆయన పేర్కొన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అని ఆయన పేర్కొన్నారు. నేడు వ్యవసాయంలో అధిక దిగుబడులు రావడంతో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వారికి పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. పట్టణ ప్రాంతాలకు పరిమితమైన ఫార్బైల్డ్ రైస్ మిల్లులు, పత్తి మిల్లులు నేడు గ్రామీణ ప్రాంతాల్లో వేలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి, ఎఫ్ డి పి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జెడ్పిటిసి లింగంపల్లి యాదగిరి, ఉమ్మడి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజి రెడ్డి, వివిధ గ్రామాల్లో సర్పంచులు, జడ్పిటిసిలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka