అక్టోబర్ 05 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షనల్ ఫోర్స్ మంచిర్యాల జిల్లాలో అన్ని మండల మరియు గ్రామస్థానాలలో సభ్యులను నియమించనున్నట్లు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రమేష్ చంద్ర తెలిపారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయిన కూడా దళిత, మైనార్టీల పైన దాడులు అణిచివేత జరుగుతూనే ఉన్నదని దళితుల పట్ల విచక్షణ అణిచివేత అత్యాచారాలు నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్ బలమైన తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
భూమి, బుక్తి ,సామాజిక విముక్తి కోసం ఎన్ ఏ పి ఎఫ్ పోరాటాలు సాగిస్తూ అట్రాసిటీలపై అవకతవకలు ఆధిపత్యాలకు సమస్యల సవాలుకై ఉధృతం చేయడానికి, దళిత మరియు ఆదివాసుల సమస్యలు మైనారిటీలు సమస్యలు పై పోరాడడానికి నేషనల్ అట్టాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్ ఎప్పుడు ముందుంటది.
నా దేశం అంతరిక్షంలో అడుగు పెట్టినప్పటికీ కూడా ఒక ఆడపిల్లకు అండగా నిలబడలేక పోతున్నది.
బిజెపి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న దాడులను ఖండించాలని ఆయన సూచించారు. బలహీన వర్గాలపై అత్యాచారాలు దాడులు జరుగుతున్నాయి,అంటే మన దేశం బ్రిటిష్ పరిపాలన కంటే 100 రేట్లు వెనుకబడి పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
కొత్తగా నియమించినటువంటి కమిటీ మెంబర్లను వారి అర్హత పత్రాలను త్వరలోనే వారికి అందజేస్తామని తెలిపారు, అలాగే ప్రతి గ్రామాల్లో గ్రామ యువతల నుండి సభ్యత్వం తీసుకోవాలి అని కోరారు.
