మర్కూక్ మండల్ తెరాస బి సి సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ శనివారం మర్కూక్ గ్రామానికి చెందిన గౌరిగారి స్వామి నర్సమ్మ కుమార్తె సోనీ వివాహానికి పుస్తే మట్టెలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సేవ చేయడం సంతృప్తిని ఇస్తుంది అని సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు వినియోగించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్,కొండపోచమ్మ టెంపుల్ డైరెక్టర్ మాధవ రెడ్డి, సీనియర్ నాయకులు పాపొల్లా రాజు ,యూత్ వింగ్ నాయకులు కరుణాకర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు