ప్రాంతీయం

ప్రజల వద్దకు ఆర్టీసీ సేవలు – ఆర్టీసి సేవలను సద్వినియోగం చేసుకోవాలి – గజ్వెల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ ఎస్.శ్రీనివాస్

122 Views

తొమ్మిది దశాబ్దాలుగా ప్రజలకు సురక్షితంగా గమ్యస్థానం చేరుస్తూ ఆర్టీసీ ఎనలేని సేవలు అందిస్తుందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. ఇందుప్రియల్ గ్రామంలో గురువారం ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ సూరంపల్లి శ్యామల కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన వివిధ రకాల ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు, వికలాంగులకు బస్సు పాసుల ద్వారా ఉచిత సేవలను అందిస్తున్నట్లు వెల్లడించారు. సురక్షితంగా సుఖవంతంగా శుభప్రదంగా గమ్యాన్ని చేరుకోవాలంటే ఆర్టీసీలోనే ప్రయాణించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అనంతరం సర్పంచ్ శ్యామల కుమార్ మాట్లాడుతూ గజ్వేల్ కు వెళ్లే విద్యార్థులకు సమయపాలన అనుగుణంగా బస్సులు మార్చాలని అలాగే అదనంగా మరొక్క బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. అలాగే దుబ్బాక నుండి వయ ఇందుప్రియల్ మీదుగా తూప్రాన్ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వీరమ్మ మల్లేశం, పంచాయతీ సెక్రటరీ, అంగన్వాడి టీచర్లు, వార్డు మెంబర్లు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7