ప్రాంతీయం

నిరుపేద వధువులకు పుస్తె మట్టేలు అందజేసిన మద్దుల నాగేశ్వర్ రెడ్డి

95 Views

తోగుట: ఇంట ఆపద వచ్చిన అన్నగా అండగా నిలుస్తాడు..పేదింటి ఆడ పిల్లలకు మేనమామగా చేయూతను అందిస్తాడు..
తోగుట మండల పరిధిలోని వెంకట్రావ్ పెట తుక్కపుర్ గ్రామాలలో నిరుపేద కుటుంబాలకు చెందిన బ్యాగరి కళ్లవ్వ రాములు కూతురు లక్ష్మి
మరియు చిక్కుడు కనకలక్ష్మి కనకయ్య కుమార్తె కళ్యాణి వివాహానికి ఎం.జే.బి ట్రస్ట్ వ్యవస్థాపకులు, బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్ట్ బాధ్యులు పోతరాజు రవీందర్. చందా రాజు లతో పుస్తమట్టెలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూదుబ్బాక
నియోజకవర్గంలో గతంలో ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు పుస్తె మట్టెలు మరియు సొంతంగా పెళ్లిళ్లు చేయడం జరిగిందన్నారు. ఇకముందు కూడా నిరుపేద కుటుంబాలకు పుస్తె మట్టలు కానీ ఆర్థిక సహాయం కూడ అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గణేష్ గౌడ్.కన్నేష్.రమేష్ గౌడ్. స్వామి. తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్