Breaking News ఆధ్యాత్మికం

వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలు….

124 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.. ఎల్లారెడ్డిపేట ముస్తాబాద్ గంభీరావుపేట వీర్నపల్లి మండలాల నుండి భారీగా క్రైస్తవ భక్తులు మరియు ప్రజలు తరలివచ్చారు.. ఆయా గ్రామాల నుండి వచ్చిన క్రైస్తవ యువతీ యువకులు క్రైస్తవ భక్తి గీతాలను ఆలాపించి అలరించారు.. చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి… సెమీ క్రిస్మస్ వేడుకలలో దైవ వర్తమానాన్ని అందించడానికి వచ్చిన స్టీఫెన్ డేవిడ్ ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే వివరాలను అద్భుతంగా వివరించారు.. సకల మానవాళి పాపాలను పరిహరించడానికి నరకం నుండి మానవులను రక్షించే పరలోకం తీసుకువెళ్లడానికి ఈ లోకానికి వచ్చినట్లు ఆయన బోధించారు.. కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి, ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, ఎల్లారెడ్డిపేట సీఐ కొలాని మొగిలి, ఎల్లారెడ్డిపేట ఎస్సై వల్లోజుల శేఖర్, ఎల్లారెడ్డిపేట పాస్టర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షులు పాస్టర్ క్రీస్తు దాస్, ఉపాధ్యక్షులు పాస్టర్ యేసుదాస్, ప్రధాన కార్యదర్శి పాస్టర్ రాజేష్, పాస్టర్ ప్రేమ్ కుమార్, పాస్టర్ అబ్రహం, పాస్టర్ మధు, పాస్టర్ గిద్యోన్, పాస్టర్ దేవరాజ్, పాస్టర్ రాజు, పాస్టర్ ప్రకాష్, పాస్టర్ యోబు, పాస్టర్ జోసెఫ్, సిస్టర్ ఎలిజబెత్, పాస్టర్ డేవిడ్, భారీ సంఖ్యలో ప్రజా ప్రతినిధులు నాయకులు నాలుగు మండలాల నుంచి ప్రజలు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7