*చేర్యాల రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కోసం మిలిటెంట్ ఉద్యమము కొనసాగించాలి.*
నేటి సమావేశం,26-08-23 చేర్యాల
గద్దల మహేందర్..
జేఏసీ నాయకులు
చేర్యాల.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా వెంటనే ప్రకటించాలని కోరుతూ, విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ లో బాగంగా ఈ ప్రాంతం అస్తవ్యస్తంగా, అశాస్త్రీయంగా విభజించబడి పాలన సాగిస్తున్నారని, అలాగే ఈ నాలుగు మండలాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూన్నారని తెలుపుతూ, ఈ ప్రాంత అస్తిత్వం, స్థానికత, అభివృద్ధి కోసం పోరాటం కొనసాగిస్తున్న పాలకులు పట్టించుకోవడం లేదనీ, అనేక ప్రజా ఉద్యమాలు నడుస్తున్న ప్రజల ఆకాంక్షను గుర్తించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తుందని, ఉద్యమము లేని చోట రామాయంపేట పటాన్చెరు డివిజన్ గా ప్రకటించారు. కానీ గత చరిత్ర అంతా వైభోగమే కానీ నేడు అనేక సమస్యలతో విలవిలాడుతున్న, పట్టింపు లేదు, కాబట్టి స్థానిక నాయకత్వం చొరవ చూపి డివిజన్ ప్రకటన చేయించాలని కోరుతున్నాము. లేనియెడల ఈ ప్రాంత ప్రజలతో కలసి మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధమవుతుందని తెలియజేస్తున్నాము.





