సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు బి ఆర్ ఎస్ పార్టీ కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని రాయపోల్ మండల సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ ఈచినా పార్టీ నాయకులు కలసి కటుగా పని చేసి మన పార్టీ నాయకుడిని గెలిపించి దుబ్బాకలో బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ఎగురవేయాలి. ప్రతి పక్షాలకు చోటు లేకుండా బిఆర్ఎస్ ప్రతి కార్యకర్త కలసికటుగా పనిచేసి దుబ్బాక గడ్డ గులాబీ అడ్డ అని మరోసారి ప్రతి పక్షాలకు చోటు లేదని తెలియజేయాలని మండలంలోని ప్రతి ఒక కార్యకర్త పని చేయాలని తెలియజేశారు.
