దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో ముందుకు వెళ్తున్నారని BRS మండల యువజన నాయకులు మస్తాన్ పఠాన్ అన్నారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో లౌకికత్వానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. కేంద్రంలో అధికారం కోసం బీజేపీ మతాన్ని వాడుకుంటూ, మత రాజకీయాలు చేస్తోందన్నారు. గంగా జమూన తెహజీబ్ కు ప్రతీకగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించడం జరిగిందన్నారు.
దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని ఆయన పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు జాతీయ స్థాయిలో కేసీఆర్‌కు పట్టం కట్టడం ఖాయమన్నారు. దార్శనికత, అనుభవం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అపారమైన పరిజ్ఞానం సీఎం కేసీఆర్ సొంతమాన్నారు. గతంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన రాష్ర్టాన్ని అనేక అంశాల్లో నంబర్ వన్‌గా నిలిపారు. భారతదేశ అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి నాయకత్వం వహించడానికి దేశంలోనే అత్యంత బలమైన రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టారన్నారు. ఇప్పుడు కేసీఆర్ అనుభవం, ఆయన నాయకత్వాన్ని భారతజాతి ఉపయోగించుకోవాల్సిన సమయం అసన్నమైందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు విధానాలపై రైతులు, సామాన్య, పేద, అన్ని వర్గాల ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. అన్ని రాష్ర్టాల నుంచి కేసీఆర్‌కు మద్దతు ఉంటుందన్న బలమైన నమ్మకం నాకున్నది. కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో విజయం సాధించటంతో పాటు ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రపంచం దేశాల్లో భారత్ ను ఆగ్రాగామిగా నిలిపే సత్తా సీఎం కేసీఆర్ ఒక్కరికే ఉందన్నారు. రాబోయే రోజుల్లో అల్లా ఆశీస్సులతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత రాష్ట్ర సమితి గులాబీ జెండా ఎగరడం ఖాయమని పఠాన్ మస్తాన్ ధీమా వ్యక్తం చేశారు.




