కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా
మంచిర్యాల జిల్లా
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు పిలుపుమేరకు ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా మరియు ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ…. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోయిన కూడా ఇప్పటివరకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నయవంచనకు గురిచేసిందని మండిపడ్డారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. అక్కడక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇల్లు కేటాయించి నిజమైన అర్హులకు అన్యాయం చేశారన్నారు. కమిషన్ల కోసం ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ నాయకులు అమ్ముకుంటున్నారని, బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో జరిగినటువంటి అవకతవకల మీద కోర్టు స్టే తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒక్క వృద్యాప పించను గాని వితంతు పింఛను గాని నూతనంగా మంజూరు చేసింది లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆడబిడ్డలకు ఇస్తామన్న స్కూటీల ఊసే లేదన్నారు. గత పంచాయతీ ఎన్నికల సమయంలో రైతులకు రైతుబంధు ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వకుండా రైతులను మోసం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేవలం బిజెపి ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారని ఉద్దేశంతో రైతుబంధు ఇస్తామని ప్రకటించడం రైతులను దగా చేయడం కోసమే అని ఆయన పేర్కొన్నారు. మంచిర్యాల మార్కెట్ రోడ్ లో రోడ్డు వెడల్పు పేరుతో అభివృద్ధి పేరుతో ఇష్టా రీతిన ఇళ్లను షాపులను కూల్చివేయడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ఎన్నికల్లో బిజెపికి ఓటు వేసారని ఉద్దేశంతోనే ఈరోజు కక్షపూరితంగా కూల్చివేతలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొంతమంది అధికారులు కూడా కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా వ్యవహరీస్తున్నారని పద్ధతి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సుస్థిరమైన పాలన అందించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకునే విధంగా పరిపాలన ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శులు దుర్గం అశోక్ , వంగపల్లి వెంకటేశ్వరరావు, ఎనగందుల కృష్ణమూర్తి జిల్లా ఉపాధ్యక్షులు అక్కల రమేష్, పట్టి వెంకటకృష్ణ, కోడి రమేష్, కమలాకర్ రావు, జోగుల శ్రీదేవి, ముత్తె సత్తయ్య మరియు జిల్లా కార్యదర్శులు రాచర్ల సంతోష్, వైద్య శ్రీధర్, మహేందర్ గౌడ్, మంత్రి సురేఖ రామయ్య, ఠాకూర్ శైలేందర్ ఉదయశ్రీ, మరియు మండల అధ్యక్షులు, అమీరిశెట్టి రాజు కుమార్, కుర్రె చక్రవర్తి, రంగా శ్రీశైలం, సత్రం రమేష్ మరియు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బోట్ల అనిత సత్యo మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





