Breaking News

బస్సులు దూరం, చదువులు భారం..

129 Views

గజ్వేల్ నియోజికవర్గం ములుగు మండల్/ములుగు గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు బస్సు కోసం ఇబ్బందులకు గురవుతున్నారు, ములుగు మండల పరిధిలోని దాసర్లపల్లి,అచ్చాయిపల్లి, సింగన్నగూడా,కొక్కండ, శ్రీరాంపూర్, తునికి బొల్లారం, బొల్లారం R & R, చిన్న తిమ్మయిపల్లి, వంటిమామిడి, తుర్కపల్లి నుండి వందలాది విద్యార్థిని విద్యార్థులు బస్సులో సీట్లు దొరక్క,నిలబడానికి స్థలం లేక పుట్పాత్ నిలబడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కళాశాలకు వస్తున్నారు. పుట్పాత్ పై స్థలం లేక తర్వాత బస్ కు రావడం కళాశాలకు ఆలస్యంగా వెళుతున్నారు. సాయంత్రం బస్సులు సమయానికి రాదు, ఒకవేళ వచ్చిన అందులో కిక్కిరిసినట్లుగా జనం ఉండడం వల్ల విద్యార్థులు మళ్ళీ బస్సు యొక్క ఫుట్పాత్ మీద నిలబడి ప్రయాణం చేయవలసి వస్తుంది, అలా ప్రయాణం చేసేటప్పుడు చేయి జారితే ఊహించని ప్రమాదం జరుగుతుంది, సాయంత్రం 4 గం: నుండి 5.30 గంటల వరకు విద్యార్దిని, విద్యార్థులు బస్సులకోసం ఎదురుచూసి ఎక్కుతున్నారు, వారు ఇంటికి వెళ్ళేసరికి చికటి అవుతుంది. ఇంకా బాధాకర విషయం ఏమిటంటే దాసర్లపల్లి, అచ్చాయిపల్లి విద్యార్దిని విద్యార్దులు 5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ తుర్కపల్లికి వచ్చి, వెళుతారు. వీరి అవస్ధలకు స్పందించి,విద్యార్దుల,క్షేమాన్ని, వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు మేల్కొని గజ్వేల్ నుంచి అచ్చాయిపల్లికి బస్సును వయా ఒంటిమామిడి, బొల్లారం మీదుగా నడపాలని విద్యార్దులు వారి తల్లదండ్రులు కోరుతున్నారు.
అందులో భాగంగా విద్యార్థినీల యొక్క క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అదనపు బస్సును నియమించాలని ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7