రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సెస్ డైరెక్టర్ గా ఎన్నికల అధికారిని బి మమతకు నామినేషన్ దాఖలు చేశారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ స్థానానికి నామినేషన్ వేసిన భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి దాఖలు చేయగా ఆయన వెంట మద్దుల బుగ్గారెడ్డి మండల బిజెపి నాయకులు ఆయన వెంట ఉన్నారు అనంతరం ఆయన మాట్లాడారు ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని విద్యుత్ సంబంధించినటువంటి సమస్యలను సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనను గెలిపిస్తే రైతులకు కరెంటు సమస్య తలెత్తకుండా చూస్తానని అవసరమున్న చోట విద్యుత్ స్తంభాలను వేయిస్తానని అలాగే అధిక విద్యుత్ వస్తున్న వారి సమస్య కోసం కలిసి మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం లో ఉన్న రైతన్నలకు 24 గంటలు అందుబాటులో ఉండి విద్యుత్ పరంగా ఎలాంటి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు అందరూ తనను ఆదరించి సెస్ ఎలక్షన్లో అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా తిరుపతి రెడ్డి కోరారు
