ప్రాంతీయం

మంథన జగన్మోహన్ రావు నివాసంలో విలేకరుల సమావేశం

16 Views

మంథన జగన్మోహన్ రావు నివాసంలో విలేకరుల సమావేశం

తెలుగు న్యూస్ మంచిర్యాల:

ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంథన జగన్మోహన్ రావు నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు వేములపల్లి సంజీవ్, వనపర్తి రాజేష్, ఇర్ఫాన్, మరియు అజర్‌లు పాల్గొని పలు అంశాలపై ఘాటుగా స్పందించారు.

రామగిరి బానేష్ అవినీతి బట్టబయలు*

మాజీ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్ మాట్లాడుతూ, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ సాగిస్తున్న అవినీతి, అక్రమ వ్యవహారాలను బహిర్గతం చేశారు.

*మేయర్ నిరంకుశ పోకడలపై ఆగ్రహం*:

నాయకుడు వనపర్తి రాజేష్
మాట్లాడుతూ, మున్సిపాలిటీలో మేయర్ సాగిస్తున్న నిరంకుశ పోకడలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. పాలనలో మహిళా కార్పొరేటర్ల పట్ల చూపిస్తున్న వివక్షను, అలాగే దళిత కార్పొరేటర్ల పట్ల అవలంబిస్తున్న అనుచిత వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.

*కట్టప్పలా వెన్నుపోటు పొడిచిన జలీల్*
మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇర్ఫాన్ మాట్లాడుతూ, ఉప్పలయ్య గారిపై జలీల్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన నిరాధార వాక్యాలను తప్పుపట్టారు. జలీల్‌కు రాజకీయ భవిష్యత్తును, రాజకీయ భిక్షను అందించింది ఉప్పలయ్య గారేనని స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తిపైనే అవాకులు చవాకులు పేలుస్తూ వెన్నుపోటు పొడిచిన “కట్టప్ప”లా జలీల్ ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.

*ఓటమిని ఇతరులపై నెట్టొద్దు – అర్కల హేమలతకు హెచ్చరిక*

నాయకుడు అజర్ మాట్లాడుతూ, మంథని జగన్మోహన్ రావు గారిపై అర్కల హేమలత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో ఆమె ఎదుర్కొన్న ఓటమికి పూర్తిగా ఆమె స్వయంకృతమే కారణమని, ఆ నెపాన్ని ఇతరులపై నెట్టడం తగదని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి నిరాధార, అనుచిత ఆరోపణలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *