ముస్తాబాద్, జూలై18 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ గ్రామంలోని కెసిఆర్ నగర్ లోని డబుల్ బెడ్ రూమ్ నందు మహమ్మద్ షాదుల్ అనునతడు రోజు మద్యం బాగా సేవించి ఇంటికి వచ్చి తనభార్య, కొడుకును వేధించగా, వారు ఆ వేధింపులు తట్టుకోలేక ఎలాగైనా చంపాలని, నిర్ణయించుకొని ఈనెల16 రోజున మధ్యాహ్నం 1.30 గంటలకు సాధుల్ తాగి ఇంటికి రాగ, మొదటగా అనుకున్నవిధంగా అతని
కొడుకు అస్రఫిన్ క్రికెట్ బ్యాట్ తో మరియు భార్య హఫీజా వైపర్ ఐరన్ పైప్ తో షాదుల్ మెడపైన, వీపులో బలంగా కొట్టగా గాయపడ్డ షాదులును గాంధీ హాస్పిటల్, హైదరాబాద్ నందు తేదీ17న రాత్రి 11.30 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందగా ముస్తాబాద్ గ్రామా పంచాయతి కార్యదర్శి పిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిరిసిల్ల రురల్ CI ముస్తాబాద్ SI జ్యోతి తెలిపారు.




