ప్రాంతీయం

అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి…

268 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 30,  ముస్తాబాద్ మండల కేంద్రంలోని మంగళగడ్డ దేదవాలయ చైర్మన్ బంగారి సత్తయ్య ఆద్యక్షతన లోకకళ్యాణార్థం సీతారాముల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా తయారు చేసిన పెండ్లి మండపంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కళ్యాణం సాగింది. రాంలక్ష్మణ పల్లె  ఆలయంలో గ్రామ సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి ఆద్వర్యంలో చేపట్టిన శ్రీరామయ్య- సీతమ్మవారుల కళ్యాణం  నేత్రపర్వంగా సాగింది. వేదపండితులు సూచించన సమయాన శ్రీరామనవమి సందర్భంగా దశరథ మహారాజు ప్రథమ పుత్రుడు అయిన పట్టాభిరాముడు చైత్రమాసం గురువారం నవమి తిథి చి”సౌ: జనకమహారాజు పుత్రిక సీతమ్మను వివహమాడాడు. వివాహన్ని తిలకించేందుకు మంగళహరతులు, ఓడిబియ్యంలో మహిళలు, స్వామివారికి నూతన వస్త్రాలు, బంగారు ఆబరణాలతో భక్తులు తరలివచ్చి వివాహవేడుకలను తిరుణాలవలె అధిక సంఖ్యలో భక్తులు తిలకాంచారు. ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈళ్యాణ  మహోత్సవ వేడుకలకు ఎంపీపీ జనగామ శరత్ రావు, పట్టాభి రాముని పెండ్లి మహోత్సవానికి హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. ఈఆధ్యాత్మిక కార్యక్రమంలో  జెడ్పీటీసీ గుండం నర్సయ్య, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి కృష్ణమూర్తి బారాస మండలాధ్యక్షుడు బోంపెలి సురేందర్ రావు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ప్రముఖులు హజరై  ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాలలో పట్టాభి రామయ్య కల్యాణం కన్నుల పండుగగా జరిగింది.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *