సెప్టెంబర్ 22
*మునుగోడు* మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో స్టూడెంట్ యూనియన్ నాయకులు *చెరుకు శివగౌడ్* మాట్లాడుతూ మునుగోడును నియోజకవర్గ కేంద్రంగా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కుట్రలో భాగంగానే నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన రెవెన్యూ డివిజన్ ను చండూర్ కు కేటాయించడం, నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ ఇప్పటివరకు కనీసం 30 పడకల ఆస్పత్రి మునుగోడు లో ఏర్పాటు చేయకపోవడం,కనీసం ప్రభుత్వ ఇంటర్ కళాశాలను ఏర్పాటు చేయకపోవడం, మునుగోడుకు మంజూరైన చాలా ప్రభుత్వ పథకాలను ఇతర మండలాలకు మళ్లించి మునుగోడును నిండా ముంచారనీ స్థానిక నాయకులు , ప్రజలు రాబోయే ప్రమాదాన్ని గుర్తించి సమిష్టిగా పోరాటానికి సిద్ధం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో *పులకరం శివ, రాపోల్ నరేశ్, గొలి ప్రవీణ్, బొజ్జ చందు, వినయ్ తదితరులు పాల్గొన్నారు*.
