
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి: మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య
TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని శుక్రవారం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నారాయణపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు.మండలానికి మొదటి దశలో 640 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని అన్నారు వాటిలో ఇప్పటికే 332 మంది లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయడం జరిగిందని,మిగతా ఇండ్లు వివిధ దశలలో పూర్తికావడానికి వస్తున్నాయని అన్నారు.మొదటి విడతలో రద్దు చేయబడిన ఇండ్ల స్థానంలో 76 ఇందిరమ్మ ఇండ్ల పురోగతిలో ఉన్నాయని,రెండో విడతలో 232 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని అన్నారు.వీటికి సంబంధించిన మండల స్థాయి అధికారుల పరిశీలన పూర్తి కావచ్చిందని త్వరలోనే రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు.ఇండ్లు పరిశీలించిన వారిలో ఉపసర్పంచ్ మధుసూదన్ రెడ్డి కార్యదర్శి ఉషశ్రీ లబ్ధిదారులు కలరు.





