ప్రాంతీయం

స్కానింగ్ సంబంధిత పూర్తి వివరాలు నిర్ణీత నమూనాలో తప్పనిసరిగా నమోదు చేయాలి

29 Views

స్కానింగ్ సంబంధిత పూర్తి వివరాలు నిర్ణీత నమూనాలో తప్పనిసరిగా నమోదు చేయాలి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత

మంచిర్యాల జిల్లా, డిసెంబర్ 27, 2025:
జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలలో సాంకేతిక వైద్య నిపుణులు, సిబ్బంది, స్కానింగ్ చేసిన వివరాలను నిర్ణీత నమూనాలో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా అడ్వైజరీ కమిటీ చైర్ పర్సన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో లింగ నిర్ధారణ పరీక్షలు, పిసిపి ఏంటి యాక్టివ్ పై ఏర్పాటు చేసిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. అరుణశ్రీ, జిల్లా పౌర సంబంధాల అధికారి యం.కృష్ణమూర్తి లతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో పి సి పి ఎన్ డి టి యాక్ట్ ప్రకారం 53 స్కాన్ కేంద్రాలు పని చేస్తున్నాయని, ఇందులో 4 ప్రభుత్వ పరంగా, 49 ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలు స్త్రీ వైద్య నిపుణులు, రేడియాలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి స్కానింగ్ కేంద్రంలో స్కానింగ్ పరికరము నిర్వహిస్తున్న వైద్యుల వివరములు నమోదు అయి ఉండాలని, అదే విధంగా ప్రతి కేంద్రంలో లింగ నిర్ధారణ పైన తీసుకుంటున్న చర్యల వివరాలపై ఫ్లెక్సీ, పోస్టర్ల ద్వారా అవగాహన కలిగించాలని తెలిపారు. లింగ నిర్ధారణ చేయబడదు, చెప్పబడదు, అడిగిన వారికి, చెప్పిన వారికి యాక్ట్ ప్రకారంగా చర్యలు చేపట్టబడును. అని వివరాలను ప్రదర్శించాలని, స్కానింగ్ కేంద్రంలో గర్భవతులకు కుర్చీలు, త్రాగునీటి సౌకర్యము కల్పించాలని, వైద్యుల వివరాలు, రుసుముల వివరాలు గోడ పై అతికించాలని తెలిపారు. గర్భవతుల స్కానింగ్ పూర్తి వివరాలను ఫార్మ్ ఆఫ్ లో నమోదు చేయాలని, స్కానింగ్ చేసుకుంటున్న గర్భవతి సంతకం తీసుకోవాలని, ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలు గర్భవతులకు, తల్లులకు, ఇంటి వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. కమిటీ సభ్యులు అడిగిన ప్రకారంగా మండలాల వారిగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, గోడ ప్రతులు, కరపత్రాలు, స్థానిక ఛానళ్ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. బర్త్ రూట్ ఆసుపత్రికి సంబంధించిన స్కానింగ్ మెషిన్ ను అప్లోడ్ చేయడం జరిగిందని తెలిపారు. పిసిపి ఏంటి పోర్టల్ లో వచ్చిన వివరాలను తెలియజేసి తగు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో గర్భవతులకు చేసే స్కానింగ్ మాత్రమే కాకుండా సూపర్ స్పెషాలిటీ వైద్యులు చేస్తున్న వారి స్కానింగ్ వివరములు కూడా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హీల్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఎన్.జి.ఓ. డా. చుంచు రాజ్ కిరణ్, గైనకాలజిస్ట్ డా. నలుమాసు శ్రీదేవి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గైనకాలజిస్ట్లు పెడియాట్రిషన్లు, ఫిజీషియన్లు, డిపిఓ ప్రశాంతి, సిహెచ్ఓలు వెంకటేశ్వర్లు, దిశా సమన్వయకర్త రమేష్, సుమన్, సీనియర్ అసిస్టెంట్ హారిక, డిపిహెచ్ఎన్ పద్మ, వసుమతి మార్తా, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *