
ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్
TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుడిది రాజేందర్ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా సుమారు 13 కోట్ల ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందని ఆరోపించారు.సర్ ప్రక్రియ సజావుగా సాగలేదని ఒక పార్టీకి కొమ్ముకాస్తున్నట్టుగా అర్థమవుతుందని ఇన్ని ఓట్లు తొలిగిపోవడానికి బాధ్యత వహిస్తూ ఈసీ కమిషనర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూడిది రాజేందర్,సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య,దేవానందం,కల్లూరి బాపురెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి,ఎస్కే సాహెబ్,ఉడుగుల సురేందర్, బండారి బాల్ రెడ్డి,లింగం గౌడ్,ఉప్పుల రవీందర్, భాను,సత్తయ్య,దండు శ్రీనివాస్,ఇమామ్,అనవనేని రవి,తిరుపతి గౌడ్,కోనేటి సాయిలు,రాజేందర్ రెడ్డి, గోపాల్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.





