Breaking News

తొగుట నూతన సీఐగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ.

23 Views

తొగుట పోలీస్‌ సర్కిల్‌ నూతన సీఐగా శ్రీనివాస్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్‌ మాట్లాడుతూ సర్కిల్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని సీఐ శ్రీనివాస్‌ కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *