సిపిఐ జేఏసీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి
చేర్యాలను వెంటనే రెవిన్యూ డివిజన్ గా ప్రకటించాలి
సీపీఐ జిల్లా నాయకులు ఈరి భూమయ్య, కత్తుల భాస్కర్ రెడ్డి
అక్టోబర్ 13
సిద్దిపేట జిల్లా చేర్యాల : చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించి సీపీఐ, జేఏసీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని సీపీఐ జిల్లా నాయకులు ఈరి భూమయ్య, కత్తుల భాస్కర్ రెడ్డి లు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చేర్యాలలో తిరగాలంటే చేర్యాలను వెంటనే రెవిన్యూ డివిజన్ గా ప్రకటించాలి
టిఆర్ఎస్ కార్యకర్తలకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి తోటి మాట్లాడి వెంటనే చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి లేదంటే చేర్యాల ప్రాంతంలో తిరిగే అర్హత టిఆర్ఎస్ కార్యకర్తలకు లేదని ప్రజలు వెంటనే దీన్ని గ్రహిస్తున్నారని అన్నారు. సిపిఐ, జేఏసీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి లేదంటే ప్రజలందరినీ పెద్ద ఎత్తున ఏకం చేసి పోరాటాలకు పిలుపునిస్తామని అన్నారు.
ఎన్ని అక్రమ కేసులు పెట్టిన రెవెన్యూ ఫోర్ ఆగేది లేదని వచ్చేంతవరకు పోరాటాలు ఆపేది లేదని అన్నారు అంతేగాక ఆక్రమ కేసులకు భయపడేది లేదు అని అన్నారు. ఇకనైనా టిఆర్ఎస్ కార్యకర్తలు రెవిన్యూ డివిజన్ మీద దృష్టి పెట్టాలని లేకుంటే ఓడిపోవడం ఖాయమని అన్నారు.





