ప్రాంతీయం

సుందరయ్యనగర్ అంగన్వాడీ 2 కేంద్రంలో ఘనంగా పోషణామాసం కార్యక్రమ నిర్వహణ

17 Views

సుందరయ్యనగర్ అంగన్వాడీ కేంద్రం 2 లో ఘనంగా పోషణామాసం కార్యక్రమ నిర్వహణ

-కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎసీడీపీఓ ఉమారాణి,అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ సాహితీ,వార్డు కౌన్సిలర్ బత్తుల రమేష్ హాజరు.

TS తెలుగు న్యూస్ 24 /7: అంగన్వాడీ కేంద్రం లో పోషణమాసం మహోత్సవ కార్యక్రమం సిరిసిల్ల పట్టణం 35వ వార్డు పరిధిలోని సుందరయ్య నగర్ 2 అంగన్వాడీ కేంద్రం లో గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీడీపీఓ ఉమారాణి,అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ సాహితి,వార్డు కౌన్సిలర్ బత్తుల రమేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా గర్భవతులకు సీమంతాల  కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. .అనంతరం వారు మాట్లాడుతూ గర్భవతులు ఆకుకూరలు కూరగాయలు తో పాటు పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మ నివ్వడం తో పాటు తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.ప్రతి పిల్లవాడికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం ద్వారా పిల్లలు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని తెలిపారు. గర్భవతులకు అంగన్వాడీ కేద్రం లో ఇచ్చే అదనపు పోషకాహారం తీసుకొని ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ స్వప్న.సఖి సెంటర్ కో ఆర్డినేటర్ రోజా,అంగన్వాడీ కార్యకర్త శ్రీరామోజీ లలిత,పబ్లిక్ హెల్త్ మేనేజర్ బి.వాణి,ఏఎన్ఎం రేణుక, ఆశ కార్యకర్త పుష్ప,ఆర్పీలు భాగ్యలక్ష్మి,మానస, రేష్మ,బాలింతలు,గర్భవతులు,తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *