🚨 శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 🚨
ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులకు, పోలీస్, రెవెన్యూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు మరియు ప్రజలకు తెలియజేయునది ఏమనగా,
గణేష్ నిమజ్జనం కార్యక్రమాల నేపథ్యంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయనున్నందున, ప్రాజెక్టు దిగువన గల గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.
ముఖ్యంగా ప్రాజెక్టు దిగువన గల గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు, పల్లెకారులు మరియు గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులు నది ఒడ్డుకు లేదా నదీ ప్రవాహ ప్రాంతంలోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
గణేష్ నిమజ్జనం సందర్భంగా సంబంధిత అధికారులు సూచించిన నిర్దేశిత ప్రదేశాల్లోనే నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తూ, భద్రతా చర్యలు మరియు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించవలసిందిగా కోరడమైనది.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.
ఇట్లు,
పి. రవీంద్ర చారీ
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
విభాగం నం. 7, రామగుండం





