ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్11, ఇటీవల ప్రమాదవశాత్తు బావిలోపడి మృతిచెందిన కౌలురైతు అనమేని నర్సింలు కుటుంబానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎస్పీగా విధులు నిర్వహించిన రాహుల్ హేగ్దేకు ముస్తాబాద్ మండలానికి చెందిన (ముదిరాజ్) గజ్జలరాజు ఫోన్ చేసి నిరుపేద కుటుంబానికి చెందిన కౌలురైతు మృతి చెందిన గురించి వివరించగా ఎస్పీ రాహుల్ హెగ్దే హృదయం ఛలించి మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపి మానవతా దృక్పథంతో 10.పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించించారు. గజ్జల రాజు ఆర్థిక సహాయం అందించిన వారికి పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక సహాయం అందించిన కార్యక్రమంలో గజ్జెలరాజు, దేశెట్టి నాని, మిరిదొడ్డి భాను, గుండెల్లి శ్రీనివాస్, అరుట్ల మహేష్ లు పాల్గొన్నారు.
