ప్రాంతీయం

ఖమ్మం ప్రెస్ క్లబ్‌ను రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతా..

6 Views

ఖమ్మం ప్రెస్ క్లబ్‌ను రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతా..

– అంతోటి శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు 

-భారతదేశపు తొలి సంపాదకులు, విలేకరుల చిత్రపటాల ఆవిష్కరణ 

ఖమ్మం, మార్చి 18, తెలుగు న్యూస్ 24/7 

ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో టిడబ్ల్యూజెఎఫ్ (హెచ్ 2843) ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారతదేశపు తొలి సంపాదకులు, విలేకరుల చిత్రపటాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు, కార్పొరేటర్ నాగండ్ల దీపక్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై చిత్రపటాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రాంగణం జర్నలిస్టుల గౌరవానికి ప్రతీకగా నిలిచింది.చిత్రపటాల ఆవిష్కరణ అనంతరం నాగండ్ల దీపక్ చౌదరి మాట్లాడుతూ, సమాజంలో జర్నలిస్టుల పాత్ర అపారమని, ప్రజాస్వామ్య పరిరక్షణలో వారు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. తొలి తరం జర్నలిస్టులు ఎటువంటి ప్రయోజనాలు ఆశించకుండా సమాజ హితం కోసం పనిచేసిన త్యాగధనులని కొనియాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన డిమాండ్లు వారి హక్కుగా , వాటి పరిష్కారానికి తాను కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ మాట్లాడుతూ, అంతోటి శ్రీనివాస్ నాయకత్వంలో ప్రెస్ క్లబ్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, యూనియన్‌లను సమన్వయం చేస్తూ ప్రెస్ క్లబ్ ప్రతిష్టను పెంచుతున్న తీరు అభినందనీయం అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రెస్ నోట్ క్లబ్ వార్షికోత్సవం, మహిళా,దినోత్సవ కార్యక్రమాలు వంటి పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రెస్ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని తెలిపారు.ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఖమ్మం ప్రెస్ క్లబ్‌ను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మోడల్ ప్రెస్ క్లబ్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తాను ప్రెస్ క్లబ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, అత్యంత ఘనంగా ప్రెస్ క్లబ్ 24వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించామని, సీనియర్ పాత్రికేయులు మోత్కూరి వెంకటేశ్వర్లును స్మరించుకున్నామని, మొక్కలు నాటే కార్యక్రమం, మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం, ప్రఖ్యాత జర్నలిస్టుల చిత్రపటాలతో ప్రెస్ క్లబ్బుకు వన్నె తెచ్చామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టి.డబ్ల్యూ.జె.ఎఫ్.హెచ్ 2843 జిల్లా కోశాధికారి అరవపల్లి నగేష్, టీబీజేఏ జిల్లా అధ్యక్షులు వందనపు సామ్రాట్ గుప్త,కుంభం రవికుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి, టీబీజేఏ నగర అధ్యక్షుడు వి.ఆర్.ఎమ్. వెంకట్, కప్పల మధు, మొగిలి నాగేశ్వరరావు, నల్లా రాకేష్, వెలిగొండ వెంకట్, ఓరుగంటి కిరణ్, షేక్ మీరా, ఎర్ర రాజేంద్రప్రసాద్, చల్లగొండ సతీష్, కందరబోయిన నాగకృష్ణ,పాగ యోనా, వేములకొండ రమేష్, మామిడాల వీరబాబు, యే లిశెట్టి రామకృష్ణ, గరిపెల్లి మహేష్, పోయిలబోయిన శ్రీను, వంగ పవన్ గౌడ్, లింగాల రామ్మూర్తి గౌడ్, మద్దెల చెన్నప్ప, చిన్నంశెట్టి రాంబాబు, వందనపు సామ్రాట్ గుప్తా తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *