
ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్ లో దొంగతనం
సబ్బులు సదిరిన సంచిని వదిలి వెళ్ళిన దొంగ
- TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్ కు చెందిన షట్టర్ తాళాలు పగలగొట్టిన దొంగ లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డాడు. సూపర్ మార్కెట్ పక్కనే ఉన్న హోటల్ యజమాని వేకువ జమున సుమారు మూడు గంటల సమయంలో తన హోటల్ తీయడానికి వచ్చి సూపర్ మార్కెట్ షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి సూపర్ మార్కెట్ యజమానికి సమాచారం అందించారు. షాపు వద్దకు చేరుకున్న యజమాని పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి దర్యాప్తు చేస్తున్నారు.కాగా చేతి సంచిలో సబ్బులు బిస్కట్ ప్యాకెట్లు సదిరిన దొంగ చేతి సంచిని షాపు ముందు వదిలి వెళ్ళడంతో దొంగతనం చేసింది చిల్లర దొంగా లేక షాపులో ఇంకా ఏమైనా పెద్ద ఎత్తున నగదు వస్తువులు చోరీ అయ్యాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.సీసీ కెమెరాను వంచడం మెయిన్ రోడ్డులో గల షటర్ తాళాలు పగల గొట్టి చోరికి పాల్పడడంతో దొంగతనం చేసింది ఒక్కడేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు.






