8 Views
ముస్తాబాద్, ఆగస్టు 20(24/7న్యూస్ ప్రతినిధి): కుమ్మరి కుల అభివృద్ధి, సంక్షేమం మరియు హక్కులకోసం మండల కుమ్మరి సంఘం నాయకులు మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా కుల
అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించి, ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు, రుణ సౌకర్యాలు, వృత్తి పరమైన సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కుమ్మర్ల ఐక్యత, అభివృద్ధి, సంక్షేమే తమ లక్ష్యమని సంఘం నాయకులు పేర్కొన్నారు. కుమ్మరి కులస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తాడూరి శ్రీనివాస్ హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మండల సంఘం కమిటీ సభ్యులు దరిపల్లి వెంకటేష్, గూడూరు శ్రీనివాస్, ఎల్లందుల కనకయ్య, రాంచంద్రం, రాములు, మల్లయ్య, గుగ్గిల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించి, ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు, రుణ సౌకర్యాలు, వృత్తి పరమైన సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కుమ్మర్ల ఐక్యత, అభివృద్ధి, సంక్షేమే తమ లక్ష్యమని సంఘం నాయకులు పేర్కొన్నారు. కుమ్మరి కులస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తాడూరి శ్రీనివాస్ హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మండల సంఘం కమిటీ సభ్యులు దరిపల్లి వెంకటేష్, గూడూరు శ్రీనివాస్, ఎల్లందుల కనకయ్య, రాంచంద్రం, రాములు, మల్లయ్య, గుగ్గిల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. No Slide Found In Slider.
Poll not found




