
ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోయిని మహదేవ్
TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోయిని మహదేవ్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ను పురస్కరించుకొని ఎల్లారెడ్డిపేట మండల ఫోటోగ్రాఫర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండల ఫోటోగ్రాఫర్లైన మారోజు కుబేర స్వామి,నాగుల శ్రీధర్ లను శాలువా కప్పి సన్మానించారు.అనంతరం మహదేవ్ మాట్లాడుతూ కాలం కదులుతున్నా జ్ఞాపకాలను పదిలపరిచి ఫోటో సజీవ సాక్ష్యగా నిలుస్తుంది అని అన్నారు.నేటి పోటీ ప్రపంచంలో వస్తున్న నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అనునిత్యం శ్రమిస్తూ ఫోటో స్టూడియో రంగంలో రాణిస్తున్న వారందరికీ,ఓ పత్రిక వారు నిర్వహించిన పోటీలో రాష్ట్రస్థాయి ఉత్తమ బహుమతికి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన షాదుల్ తీసిన చిత్రం ఎంపిక కావడంతో వారికి లయన్స్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నామనీ అన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి వంగ శ్రీకాంత్ రెడ్డి,డైరెక్టర్ బంధారపు లక్ష్మారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.





