వినాయక నవరాత్రులు పురస్కరించుకొని హైదరాబాద్ లోని ప్రసిద్ధి చెందిన బాలపూర్ గణేషునికి ఆదివారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతులు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అయోధ్యలో రామందిరం పోలిన విధంగా ఇక్కడ వినాయకుని డెకరేషన్ సెట్టింగ్ కూడ అలాగే అద్భుతంగా ఉందన్నారు. ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామ్మన్నారు.
