ప్రాంతీయం

అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం:రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్

81 Views

అమరుల త్యాగఫలమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమని, వారి త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం సిరిసిల్ల పట్టణంలో అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమర వీరులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్ , రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్,,మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ , జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, ఉపాధ్యక్షులు సిద్దం వేణు , జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆర్డీఓ టి శ్రీనివాసరావు,మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్ హల్ లో జిల్లాలోని 30 అమర వీరుల కుటుంబాలను సన్మానించారు.తెలంగాణ స్వరాష్ట్ర సాధన లో అసువులు బాసిన వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్ మాట్లాడుతూ……అమరుల త్యాగాల ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని ఆయన అన్నారు. తెలంగాణను ఆంధ్ర ప్రాంతంలో కలిపినప్పుడే 1956లో ప్రత్యేక రాష్ట్ర ఆలోచన తెలంగాణ ప్రాంత ప్రజల్లో వచ్చింది అన్నారు.నైజాం సర్కార్ నుంచి విముక్తి కల్పించేందుకు మన పూర్వీకులు పోరాటం చేశారన్నారు. రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించారన్నారు. సమాజంలో పెత్తందారులు సామాన్య ప్రజలను అణగదొక్కిన చీకటి రోజులు 1946 నుంచి 1948 వరకు ఉండేవన్నారు.తెలంగాణ ప్రాంతంలో ఈ వివక్షతకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేశారని గుర్తు చేశారు. సిరిసిల్ల ప్రాంతంలో చాలా రోజులు ఈ పోరాటం కొనసాగింది అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ తుపాకీ చెబట్టి పెత్తందార్లకు వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలు నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రతి కుటుంబానికి పోరాట చరిత్ర ఉందని అన్న ఆయన ఆ విషయాన్ని మన పెద్దల దగ్గర కదిలిస్తే గత చరిత్ర మొత్తం చెబుతారు అన్నారు. గత చరిత్ర తెలుసుకున్న వాడే భవిష్యత్తు చరిత్రను నిర్మిస్తాడని….. చరిత్ర తెలిసిన వాడే చరిత్రను నిర్మిస్తాడని ఆయన పేర్కొన్నారు. మలిదశ ఉద్యమం 2001లో కేసీఆర్ నేతృత్వంలో ప్రారంభమైందన్నారు. ఇది అయ్యేదేనా అంటూ చాలా మంది తొలి రోజుల్లో ఎగతాళి చేశారని అన్నారు. ఎన్నికలలో గెలుపోటములు సహజమని పేర్కొన్న ఆయన ఉద్యమం ప్రారంభించిన తొలినాళ్లలో పోటీ చేసిన ఎన్నికల్లో కింద పడ్డ లేచి కొట్లాడినమని గుర్తు చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఆ పదవులను తృణప్రాయంగా త్యజించి స్వరాష్ట్ర సాధన ఉద్యమంలోకి దూకారన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రాంత సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని కేసీఆర్ గారు ప్రశ్నించారన్నారు. తెలంగాణ ప్రాంతంకు జరిగిన అన్యాయం కేసీఆర్ మదిలో ఉండబట్టే ఆనాటి అనేక వేదికల్లో ప్రశ్నించారని గుర్తు చేశారు.మలిదశ ఉద్యమంలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోవద్దని భావించి శాంతియుత ఉద్యమానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. 2009 డిసెంబర్ వరకు ఒక్కరు కూడా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోలేదని తెలిపారు. 2009 డిసెంబర్ లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసి దాన్ని వెనుక తీసుకున్న నేపథ్యంలో ప్రాణ నష్టం జరిగిందన్నారు. పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.గడిచిన 9 ఎండ్లలో అమరుల ఆశయాలే స్ఫూర్తిగా, ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలే ఊపిరిగా, తెలంగాణ ఉద్యమ నినాదాలే మైలురాళ్లుగా, దేశంలోనే రాష్ట్రాన్నిసిఎం కేసిఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని అన్నారు.రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలుపుతామని అన్నారు.రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్,,మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్ నేతృతంలోని రాష్ట్ర ప్రభుత్వం అమరుల ఆకాంక్షలను నెరవేర్చుతూ అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందన్నారు.అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి సామూహిక భోజనాలు చేశారు.అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలో పురపాలక సంఘం తెలంగాణ ఉద్యమ కారులను ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఉద్యమకారులను సన్మానించారుఅనంతరం ఇల్లoతకుంట మండలం వల్లంపట్ల గ్రామ శివారులో ఇల్లంతకుంట నుంచి సిరిసిల్లకు వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను బస్సు ఢీకొని బోల్తా పడిన ఘటనలు గాయపడి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్ , రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్,,మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ లు పరామర్శించారు. అధైర్య పడవద్దని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. మెరుగైన వైద్యచికిత్స అవసరమనుకుంటే హైదరాబాద్ కు కూడా పంపిస్తామని చెప్పారు.శాసనసభ్యులు రసమయి బాల కిషన్ మాట్లాడుతూ బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రి కేటీఆర్ తెలుసుకుంటున్నారని మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు అన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, ఉపాధ్యక్షులు సిద్దం వేణు , జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్యప్రసాద్ ఎన్ ఖీమ్యా నాయక్ ,ఆర్డీఓ టి శ్రీనివాసరావు,మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.

 

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *