సిద్దిపేట్ మర్కుక్, ఆగస్టు 20, తెలుగు న్యూస్ 24/7
ఎల్‌నినో ప్రభావం – పంటల వైవిధ్యీకరణపై సర్పంచులకు రైతులకు ప్రజా ప్రతినిధులకు అవగాహన,మర్కుక్ రైతువేదికలో మండల ప్రత్యేక అధికారి, డిప్యూటీ సీఈఓ సంధ్యా,ఆధ్వర్యంలో ఎల్‌నినో ప్రభావం మరియు పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచులకు రైతులకు ప్రజా ప్రతినిధులకు ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం లోపించే అవకాశం ఉండటంతో పాటు, ముఖ్యంగా సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో డ్రై స్పెల్స్ అధికంగా ఉండే అవకాశం ఉందని వివరించారు. దీనివల్ల బోర్లు, బావుల్లో నీటి మట్టాలు తగ్గిపోయే అవకాశం ఉన్నందున నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలైన ఆముదం, పెసలు, మినుములు, కందులు, జొన్నలు, సజ్జలు, వంటి పంటలను సాగు చేసి పంటల వైవిధ్యీకరణను చేపట్టాలని రైతులను కోరారు. తక్కువ నీటి వినియోగంతో పంటలను సాగు చేయడం ద్వారా నీటి వనరులను సంరక్షించడంతో పాటు వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాము , ఎంపీడీవో విక్రమ్, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీ కనకయ్య గౌడ్, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఏఈఓలు మరియు రైతులు పాల్గొన్నారు.





