
జాతీయ జెండా ఎగురవేసిన గౌడ సంఘం అధ్యక్షులు కొండ స్వామి గౌడ్
TS 24/7 తెలుగు న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు కొండ స్వామి గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ హాజరయ్యారు.వందేమాతర గీతం,జాతీయ గీతాలాపన బోలో స్వాతంత్ర్య భారత్ కి జై నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కమిటీ,రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు,గౌడ సంఘం సభ్యులు,పుర ప్రముఖులు,విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





