ప్రాంతీయం

పదో తరగతిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థినికి నగదు బహుమతి..

58 Views

సిద్దిపేట జిల్లా మర్కుక్, ఆగస్టు 15,తెలుగు న్యూస్ 24/7 

పాములపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని లెంకల సన, పదో తరగతి పరీక్షల్లో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించింది. విద్యార్థిని సాధించిన ప్రతిభను అభినందిస్తూ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా సత్కరించారు.గత సంవత్సరం ఇచ్చిన మాట ప్రకారం గ్రామానికి చెందిన కొండనోళ్ల నరేష్ విద్యార్థిని లెంకల సన,కు రూ.1,000 నగదు బహుమతిని అందజేశారు. విద్యార్థులలో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి బహుమతులు అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థిని సన,ను ప్రధానోపాధ్యాయులు లతీఫ్ సైదా, గ్రామ సర్పంచ్ భవాని,బాలకిషన్, ఉపసర్పంచ్ జుట్టు సుధాకర్, వార్డు సభ్యులు,ఉపాద్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులుఅభినందించారు.భవిష్యత్తులో కూడా విద్యలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న కొండనోళ్ల నరేష్‌,ను గ్రామస్తులు అభినందించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *