దుబ్బాక సీరియల్ మర్డర్ల గుట్టు రట్టు చేసిన సిద్దిపేట పోలీసులు.
సిద్దిపేట్, ఆగస్టు 16, తెలుగు న్యూస్ 24/7
నిందితురాలి అరెస్ట్ జుడీషియల్ రిమాండ్‌కు మరియు సీసీఎల్ బాలుడిని జువైనల్ హోమ్ కు తరలింపు,వివరాలు వెల్లడించిన సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్,సిద్దిపేట:దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ శివారులో కలకలం రేపిన పాక్షికంగా కాల్చిన గుర్తు తెలియని మృతదేహాన్ని హత్య చేసి కాల్చినట్టుగా నిర్దారణ అయినది. అట్టి మృతదేహం భూంపల్లి గ్రామానికి చెందిన అతికం విజయ(వయసు 45) భర్త రామస్వామి గా గుర్తించారు, అదే గ్రామానికి చెందిన తల్లి, కొడుకు కలిసి బంగారం కోసం చేసిన హత్యగా పోలీసులు తేల్చారు. నిందితురాలిని అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్‌కు మరియు బాలుడిని జువైనల్ హోమ్ కు తరలించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ (సీపీ) రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.కేసు వివరాలు:తేదీ 08.08.2026 నాడు ఉదయం రామక్కపేట గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వనం నర్సయ్య పొలం దగ్గర రోడ్డు పక్కనే పాక్షికంగా కాలిన ఒక గుర్తు తెలియని ఆడ మనిషి శవం ఉన్నదని పిర్యాదు మేరకు దుబ్బాక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తులో స్థానిక పోలీసు తో పాటు సిసిఎస్ మరియు ట్రాన్స్పోర్ట్ తో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడమైనది. తేలిన అసలు నిజం:1) దర్యాప్తులో అట్టి గుర్తుతెలియని శవం భూంపల్లి గ్రామానికి చెందిన అతికం విజయగా గుర్తించారు. తదుపరి విచారణలో భాగంగా చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న సిసిటివి పూటేజ్ ద్వారా వెరీఫి చేయగా, అసలు నిజం బయటపడింది. డబ్బులు సులభంగా సంపాదించాలనే ఉద్దేశ్యం తో, అదే గ్రామానికి చెందిన నిందితురాలు చాకలి రజిత (38) (భర్త. దుబ్బయ్య)మరియు బాలుడు ఇద్దరు కలిసి పథకం ప్రకారం వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఒంటరిగా నివసిస్తున్న అతికం విజయను 08/08/2026 నాడు సాయంత్రం వల్ల కిరాణం షాప్ లోకి పిలిచి గొంతు పీసీకి చంపి, ఆదేరోజు రాత్రి ఇద్దరుకలిసి శవాన్ని (టీవీఎస్ ఎక్స్ ఎల్) పైన రామక్కపేట గ్రామ శివారులో రోడ్డు పక్కన పెట్రోల్ పోసి కాల్చివేసి హత్య చేశారు. 2) గతంలో కూడా వీళ్ళు 28/05/2026 రోజున కూడా డబుల్ బెడ్రూం లలో నివాసం వుండే కుంట రేఖను కూడా పైన తెలిపిన విదంగా చంపి అచ్చుమయిపల్లి గ్రామ అడవిలో కాల్చివేసి హత్య చేశారని దర్యాప్తులో వెల్లడైంది.3) గతంలో జూన్-2025 లో భూంపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ (భర్త జెన్నారెడ్డి) గారిని ఉదయం వెంచర్ లో వాకింగ్ చేస్తుండగా ఆమెను కొట్టి ఆమె మెడలోవున్న 5 తులాల పూస్తేల త్రాడును కూడా వీళ్ళే దొంగలించరాని తెలిసింది. :స్వాదినం చేసుకున్న వస్తువుల వివరాలు:1) 5.61 తులాల బంగారు ఆభరణాలు, 53 తులాల వెండి ఆభరణాలు.2) బ్లూ కలర్ TVS XL నం. AP15AC1165.3) నగదు 1,03,000/- రూపాయలు, 4) రెండు మొబైలు ఫోన్ లు(వీటి మొత్తం విలువ అందాజ 10 లక్షల రూపాయలు ఉంటుంది.)దుబ్బాక పోలీసులు నిందితురాలు చాకలి రజితను అరెస్ట్ చేసి, జుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. అదే విదంగా బాలుడిని జువైనల్ హోమ్ కు పంపనైనది. పోలీసుల దర్యాప్తులో ఈ తల్లి-కొడుకుల ముఠా గురించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి: వీరు టీ పాయింట్ల వద్ద కూర్చున్న ప్రజల యొక్క కదలికలను, వారి వద్ద ఉన్న ఆస్తులు, గొడవలను గమనిస్తూ ఉండేవారు. ఆస్తి తగాదాలు లేదా ఇతర గొడవలు ఉన్న వ్యక్తులను గమనించి, ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని, వారిని దోచుకోవడమే కాకుండా ప్రాణాలు కూడా తీసారు. వీరు ఇప్పటికే రెండు హత్యలు చేసినట్లు నిర్ధారణ కాగా, విచారణలో మరో నాలుగు టార్గెట్లను కూడా సిద్ధం చేసుకున్నట్లు తేలింది.ప్రతి నేరం తర్వాత వారు పోలీసుల దృష్టిని వేరే వైపు మళ్లించేవారు.పైన తెలిపిన వ్యక్తులను ఎంచుకోవడానికి కారణం:1. మృతురాలు అతికం విజయకు ఆమె పాలివారితో భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయని, ఆమెను కనిపించక పోతే వాళ్ళ కుటుంభ సబ్యులకు పాలివారిపైన నే అనుమానం వస్తుందని2. మృతురాలు కుంట రేఖ ఇంస్టాగ్రామ్ లో ఆక్టివ్ గా ఉండేది. అందువల్ల ఆమెను చంపితే ఇంస్టాగ్రామ్ లో మాట్లాడేవారిపైననే అనుమానం వస్తుందని ఆమెను ఎంచుకోవడం జరిగినది. 3. భూంపల్లి గ్రామానికి చెందిన అన్నపూర్ణ ఎప్పుడు ఒంటరిగా వాకింగ్ కు వెల్లుతుండేది, అందువల్ల ఆమెను ఎంచుకోవడం జరిగినది. 4. భూంపల్లి గ్రామానికి చెందిన ఇంకో నలుగురు వ్యక్తులను కూడా చంపడానికి టార్గెట్ పెట్టుకున్నారని విచారణలో తెలిసినది. ఈ సందర్భంగా సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ ఐపీఎస్ మాట్లాడుతూ, కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి నిందితురాలిని మరియు బాలుడిని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కె సుతో పాటు గతంలో జరిగిన మరొక మర్డర్ కేసు, రాబరీ కేసులన్నింటినీ పోలీసులు విజయవంతంగా ఛేదించారని పేర్కొన్నారు. ఇట్టి కేసులను ఛేదించిన సిద్దిపేట ఏసిపి రవీందర్ రెడ్డి , దుబ్బాక సీఐ రాజేష్ , దుబ్బాక ఎస్ఐ కీర్తిరాజు, భూంపల్లి ఎస్ఐ రాజశేఖర్ , మీరుదొడ్డి ఎస్ఐ సతీష్ , ఎస్ఐ సైఫ్ అలీ, సిద్దిపేట డివిజన్ సిబ్బంది, మరియు సిసిఎస్ సదన్ కుమార్ , ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి మరియు సిబ్బంది, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ , టాస్క్ ఫోర్స్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ అభినందిచారు.ప్రజలకు పోలీస్ కమిషనర్ సూచనలు:1. ప్రజలు తమ పరిసరాల పట్ల, ముఖ్యంగా నిర్జన ప్రాంతాలలో సంచరించేటప్పుడు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. గుర్తుతెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలను వెల్లడించకూడదు.2. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, వ్యాపార సంస్థల వద్ద సరైన బ్యాకప్‌తో కూడిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.3.’సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత, గ్రామాల్లో సీసీటీవీ నిఘా గణనీయంగా మెరుగుపడింది. సురక్షితమైన సమాజం నిర్మాణంలో సీసీటీవీ నిఘా వల్ల కలిగే ప్రయోజనాలకు ఈ కేసే మరో నిదర్శనం.
4. పౌరులందరినీ కాపాడేందుకు సిద్దిపేట పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నాము.





