
జాతీయ జెండా ఎగురవేసిన తిమ్మాపూర్ సింగిల్ విండో వైస్ చైర్మెన్ బుగ్గ కృష్ణమూర్తి శర్మ
TS 24 తెలుగు న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ సింగిల్ విండో కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సింగిల్ విండో వైస్ చైర్మెన్ బుగ్గ కృష్ణమూర్తిశర్మ జాతీయ జెండా ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ అందె సుభాష్,డైరెక్టర్లు లక్ష్మణ్,పెంజర్ల నారాయణ,అందె గంగవ్వ,కాంగ్రెస్ నాయకులు దండు శ్రీనివాస్,సీఈఓ శశివర్ధన్ గౌడ్, పిఎసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





