ముస్తాబాద్, నవంబర్ 20, (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు వారం రోజుల్లో సమీపిస్తున్నందున ఇంటింటి ప్రచారంలో భాగంగా 6,గ్యారంటీలతో సోనియాగాంధీ ప్రవేశపెట్టిన పథకాలను తెలియపరుస్తూ ఇప్పటికీ ఏ ప్రభుత్వం ఇవ్వని
పథకాలను నాడు తెలంగాణను ఇచ్చినతల్లి సోనియానే నేడు పథకాలను అమలుపరచడం పేదలకు వరంలాంటిదన్నారు. తెలంగాణలో నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన పథకాలు ఎన్నోఉండగా అందులో కొన్ని తీసుకున్నట్లయితే నిరుపేదలకు ఉపాధి పేరుతో ఉపాధి చూయించి ఏకకాలంలోనే రైతులకు రుణమాఫీ తో పాటు 2,వందలు పింఛన్ మొదలుకొని నేడు 2,వేలకు పెరిగిందంటే ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే అమలుపరిచిందని ఓటర్లకు వివరిస్తూ 2,వేల పింఛన్ కాకుండా 4.వేల.పింఛను ఇస్తూ మహిళలకు ఉచిత బస్సుపాసును 5వందలకే గ్యాస్ సిలిండర్, 2.వందల యూనిట్లవరకు కరెంటుబిల్లు ఉచితం, ఏకకాలంలోనే రైతులకు 2.లక్షల రుణమాఫీ, ఇంటివద్దనున్న ఉన్న మహిళలకు 25 వందలు ఖర్చులకు సదుపాయాలు కల్పిస్తూ
ఇంకేమి కావాలి అన్నారు. 12, వందల పైచిలుకుమంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ వస్తే నాడు కెసిఆర్ ఇంటికో ఉద్యోగమనిచెప్పి అనేక వరాలతో గద్దెనెక్కి కూర్చున్నారు. ఓడెక్కినంక ఓడ మల్లన్న ఓడదిగినంక బోడమల్లన్న అన్నట్లుగా నడుస్తున్న ఈప్రభుత్వం ఉందన్నారు.
అల్లారు ముద్దుగా పెంచుకున్న మీబిడ్డల బంగారు భవిష్యత్తును ఉద్యోగంలేక ఉరితాల్లకు వేల్లాడుతుందన్నారు. పిల్లలను కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులదేనని అన్నారు. ఇంకా అనేక పథకాలతో ముందుకు వస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ దే ఈ ఒక్కసారి కాంగ్రెస్ చేయి గుర్తుకు ఓటువేసి గెలిపిస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనేక అభివృద్ధి పనులతో ముందుకు వెళ్తుందన్నారు.




