ప్రాంతీయం

సిద్దిపేట అర్బన్ మండలంలోని సర్పంచ్ అభ్యర్థులపై కేసులు నమోదు.

20 Views

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో.

ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు.

సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్ పల్లి, మిట్టపల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులపై కేసులు నమోదు.

సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్

 సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 8, తెలుగు న్యూస్ 24/7 

ఎన్సాన్ పల్లి సర్పంచ్ అభ్యర్థి అయిన నాగుల స్రవంతి ఎన్సాన్ పల్లి పెద్దమ్మ గుడి వద్ద ఒకే కులానికి చెందిన 44 మందికి మద్యం పంపిణీ చేస్తున్నారని సమాచారం మేరకు సిద్దిపేట అర్బన్ మండల ఫ్లయింగ్ స్కాడ్ టీం ఇంచార్జ్ వంశీకృష్ణతో కలిసి పెద్దమ్మ గుడి వద్దకు వెళ్ళి మద్యం పంపిణీ చేయడానికి సిద్దంగా ఉంచిన 68 రాయల్ స్టాగ్ క్వార్టర్ బాటిల్స్, 39 మోటార్ సైకిల్స్ స్వాధీన పర్చుకోని నాగుల స్రవంతి తో పాటు 44 మందిపై కేసు నమోదు చేయనైనది.మిట్టపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతల కుమార్ తన ఇంటి నందు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని సమాచారం మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్( ఆర్.ఎస్.ఐ ) సురేష్ తన సిబ్బందితో వెళ్ళగా పోలీస్ వస్తున్నది గమనించి డబ్బులు గోడ అవతల పడేయడంతో అట్టి రూ. 25,500/- స్వాధీన పర్చుకోని చింతల కుమార్, అతనితో పాటు ఉన్న చింతల రాజుపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదు చేయనైనది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *