జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా
అంబర్ పేట గ్రామంలో యువకులకు, గ్రామ ప్రజలకు అవగాహన
-గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి
సిద్దిపేట్ జిల్లా గౌరారం జనవరి 22
సిద్దిపేట జిల్లా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, సిబ్బందితో కలిసి అంబర్ పేట గ్రామంలో యువకులకు, గ్రామ ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు నిబంధనలను పాటించాలని సూచించారు. త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని, వాహనం నడిపేటప్పుడు వాహనకు సంబంధించిన డాక్యుమెంట్స్ డ్రైవింగ్ లైసెన్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు.
