Breaking News

కురుస్తున్న వర్షం కూలుతున్న ఇండ్లు

192 Views

కురుస్తున్న వర్షాలు కూలుతున్న ఇండ్లు

అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలంటున్న పలువురు

TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇండ్లు కూలుతున్నాయి.తాజా సమాచారం ప్రకారం బుధవారం మండల కేంద్రంలో మొదటి బైపాస్ రోడ్డులో కోనేటి మల్లయ్య ఇంటి పైకప్పు కూలిపోగా,గురువారం రాగట్లపల్లి గ్రామానికి చెందిన గొర్రె మల్లయ్య ఇంటి పైకప్పు పాక్షికంగా కూలిపోయింది.బండ లింగంపల్లి గ్రామంలో కొడిముంజ లక్ష్మి ఇల్లు మట్టి గోడ కలింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. మండల వ్యాప్తంగా శిధిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని అవసరమైతే వారికి తాత్కాలిక పునరావాసం కల్పించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాగా బాధితులంతా ఇందిరమ్మ ఇంటి కోసం ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకున్న వారు కావడం గమనార్హం.వారి ఇండ్లు శిథిలావస్థలో ఉన్నాయని ఇందిరమ్మ ఇంటి మంజూరుకై ఎదురుచూస్తున్నారని గ్రామస్తులు తెలుపుతున్నారు.లిస్టులో పేర్లు వచ్చాయి గాని ప్రొసీడింగు లెటర్ రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏ కారణం చేత తమ ఆర్జీలు ఆగినా మండల అధికారులు తక్షణమే స్పందించి తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలని వేడుకుంటున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *