అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ కంపెనీ ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజీ – వార్త రాసి రూ.3 లక్షలు డిమాండ్ చేసిన తెలుగు ప్రభ దినపత్రిక రిపోర్టర్ అనీష్
-వెనకుండి నడిపించినగొర్లపెల్లి సురేష్.. తెలుగు ప్రభ కట్టింగ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి బ్లాక్ మెయిల్.
-అనంతరం రంగంలోకి అగ్నిధార రిపోర్టర్ రవికుమార్ యాదవ్
-ముగ్గురు కూడపలుక్కొని అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ యజమానికి బెదిరింపులు
-ఆధారాలతో సహా పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..కేసు నమోదు చేసిన పోలీసులు
అంజనీపుత్ర సంస్థపై అసత్య కథనాలు ప్రచురిస్తామని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసిన ఇద్దరు విలేకరులు, వారి అనుచరులపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు అంజనీపుత్ర (రియల్ ఎస్టేట్) యజమాని గుర్రల శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం… గత కొన్ని రోజులుగా అంజనీపుత్ర సంస్థపై ఎలాంటి ఆధారాలు లేకుండా తెలుగు ప్రభ రిపోర్టర్ అనీష్, గొర్లపల్లి సురేష్ తో కలిసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక వార్త రాసిన అనంతరం.. జూన్ 29న (29-06-2026) తెలుగు ప్రభ రిపోర్టర్ అనీష్ నేరుగా తమ ఆఫీసుకు వచ్చి, సంస్థపై తప్పుడు వార్త రాయకుండా ఉండాలంటే నాకు సురేష్ కి రూ. 3,00,000 (మూడు లక్షలు) ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు . “మేము ఎలాంటి తప్పు చేయలేదు, డబ్బులు ఎందుకు ఇవ్వాలి?” అని ప్రశ్నించగా… “మీరు డబ్బులు ఇవ్వకుంటే రోజూ ఇలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇబ్బంది పెడతాం” అని బెదిరించారన్నారు. ఇబ్బందులు తాళలేక జూన్ 29 రాత్రి 09:15 గంటల సమయంలో 100 ఫిట్ రోడ్డులోని మా ఆఫీసులో అనీష్‌కు రూ. 50,000 నగదు ఇచ్చానని, మిగిలిన డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పానని తెలిపారు. ఆ తర్వాత మిగిలిన డబ్బుల కోసం సురేష్ రోజూ వాట్సాప్‌లో మెసేజ్‌లు చేస్తూ తీవ్రంగా వేదిస్తున్నాడని, డబ్బులు ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో సంస్థపై పోస్టులు పెడుతూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా, ‘అగ్నిధార’ దినపత్రికకు చెందిన ఎడిటర్ రవికుమార్ యాదవ్ కూడా వీరితో జతకట్టాడని, అతను కూడా సంస్థపై తప్పుడు కథనాలు ప్రచురిస్తూ బెదిరిస్తున్నాడు అన్నారు..
ఇందుకు సంబందించి నిందితులు పంపిన వాట్సాప్ మెసేజ్‌లు, బెదిరింపు కాల్స్ సంభాషణలు, పెన్ డ్రైవ్‌లో రికార్డు చేసిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల స్క్రీన్ షాట్ ఆధారాలను పోలీసులకు సమర్పించానని, తమను బెదిరించి డబ్బులు వసూలు చేసిన తెలుగు ప్రభ రిపోర్టర్ అనీష్, గొర్లపల్లి సురేష్, అగ్నిధార రిపోర్టర్ రవికుమార్ యాదవ్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాదితుడు కోరారు. గుర్రాల శ్రీధర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థపై ఆసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని ఈ సందర్బంగా గుర్రాల శ్రీధర్ తెలిపారు.
గతంలో మా సంస్థ నుంచి డబ్బులు తీసుకున్న కొందరు ప్రైవేట్ వ్యక్తులు సైతం కావాలని సంస్థను ఇబ్బంది పెట్టేందుకు తప్పుడు వార్తలు రాయిస్తూ, RTI, కంప్లైన్ట్ లు పెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి బెదిరింపులు, బ్లాక్ మెయిల్స్ ను ఇకపై ఉపేక్షించేది లేదని.. కావాలని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఇట్లు :
అంజనీ పుత్ర యాజమాన్యం





