ప్రాంతీయం

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి

4 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి*

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ వర్షాలతో నాలాల ప్రవహించే నీరు రోడ్డుపై రావడంతో ఆ ప్రాంతాలను పెద్దపల్లి డిసిపి బి రామ్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్, మేయర్ మహంకాళి స్వామి, గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తో మల్కాపూర్, మెడికల్ కళాశాల, 5 ఇంక్లైన్, తదితర ప్రాంతలలో కలిసి వరదను పరిశీలించి జిల్లాలో భారీ వర్షాలతో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రావద్దని, అదేవిదంగా అధికారులకు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, భారీ వర్షాలు కురుస్తుందున వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువులు నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉందని, వాటి వద్దకి ఎవరు వెళ్లవద్దన్నారు. గోదావరి, మానేరు నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలు, యువత వెళ్లకూడదన్నారు. వర్షం నీటి వల్ల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించారు. పిల్లలు, యువకులు చెరువులు నది దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలంచడానికి జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఎటువంటి సహాయం కావాలన్నా Dail 100 కి లేదా స్థానిక పోలీస్ అధికారులకి ఫోన్ చేయాలని డీసీపీ సూచించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *