భారత సైనికుల ధైర్యానికి సెల్యూట్ భారత్-చైనా సరిహద్దుల్లో ఈ నెల 9న ఘర్షణ వాతావరణం నెలకొందని అధికారులు తాజాగా వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో ఇరుదేశాల సైనికులు కొట్టుకోగా.. రాడ్లు, కర్రలతో డ్రాగన్ దళాలు మన సరిహద్దుల్లోకి దూసుకొచ్చాయి. 300 మంది చైనా సైన్యాన్ని.. భారత్కు చెందిన 100 మంది సైనికులు ధైర్యంగా ఎదుర్కొన్నారు. తాజాగా దీనికి సంబంధించి వీడియో బయటకురాగా.. భారత సైనికులకు అంతా సెల్యూట్ చేస్తున్నారు.




