Breaking News

అమ్మో డబుల్ సెంచరీ కొట్టిన టమాట ధరలు..*

73 Views

*అమ్మో డబుల్ సెంచరీ కొట్టిన టమాట ధరలు..*

 

*ఎం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. అనే చందంగా మారింది*

 

*ప్రస్తుత ధరలు చూస్తుంటే.. సామాన్యుడి బ్రతుకే ప్రశ్నార్థంగా మారింది.*

 

*కూరగాయల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి.*

 

టమాటా, పచ్చిమిర్చి ధర ఎన్నడూ లేనంత పెరిగాయి. ఇక, సామాన్యుడికి అందనంటున్నాయి. ప్రస్తుతం మెదక్‌ మార్కెట్‌లో టమాటా అందనంత ఎత్తులోకి చేరింది. పచ్చిమిర్చి ధర ఘాటెక్కిస్తుంది. వామ్మో ఇవేమి ధరలు అంటూ కొనేందుకు సామాన్య ప్రజలు జంకుతున్నారు. పది రోజుల వరకు కిలో రూ.80 నుంచి 100 ఉన్న టమాట.. ఇప్పుడు మెదక్‌ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో కిలో డబుల్ సెంచరీ కొట్టింది. పచ్చిమిర్చి కిలో రూ.130కి చేరింది.

 

మెదక్ జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో, పల్లెలో చూసినా ఇవే ధరలు పలుకుతున్నాయి. ఏ కూరగాయ కొందామన్న కిలో 80 నుంచి 100 రూపాయలకు తక్కువ లేదు. దాంతో కిలో కొనేవారు కూడా పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కూరగాయ పంటలు పూర్తిగా పాడవడంతో పాటు కొన్నాళ్లు పాటు కాచిన భారీ ఎండలతో దిగుబడి పూర్తిగా తగ్గింది. ఇతర ప్రాంతాలను నుంచి దిగుమతి పడిపోవడంతో కూరగాయల కొరత ఏర్పడి ధరలు అకాశానికి అంటుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కిలో టమాట రూ.20 ఉంది.

 

ప్రస్తుతం మెదక్‌ మార్కెట్‌లో హోల్‌సేల్‌ కిలో నాణ్యమైన టమాటా ధర రూ.130, రీటైల్‌ మార్కెట్‌లో కిలో రూ.200గా ఉంది. పది రోజుల క్రితం వరకు కిలో రూ.80 నుంచి 100 ఉన్న టమాట ధర ప్రసుత్తం రూ.200కు చేరింది. 25 కిలోల బాక్స్‌ ధర మార్కెట్‌లో రూ.3,800 నుంచి రూ.4 వేలు ధర పలుకుతోంది. పచ్చిమిర్చి ధర రూ.130కి చేరింది. బీరకాయ రూ.120, చిక్కుడుకాయ ధర రూ.100, అల్లం రూ.200, బీన్స్‌ రూ.120 పలుకుతోంది. ఆనిశ్చిత వాతావరణ పరిస్థితులు టమాటా సరఫరాపై ప్రభావం చూపడంతో ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. పెరిగిన ధరలతో కూరగాయలు కొనలేకపోతున్నామని పేద, మధ్య తరగతి ప్రజలంటున్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *