పేదింటి ఆడబిడ్డ పెళ్లికి పుస్తే మట్టెలు అందజేసి మానవత్వం చాటుకున్న సర్పంచ్ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో బుదవారం సర్పంచ్ రావికంటి చంద్ర శేఖర్ గుప్త సౌజన్యంతో ఆర్బిపి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ఎర్కలి రమేష్ కూతురు పూజిత వివాహానికి పుస్తే మట్టెలు అందజేశారు ఈసందర్భంగా సర్పంచ్ చంద్ర శేఖర్ గుప్త మాట్లాడుతూ గ్రామంలో జరిగే ఆడబిడ్డల పెళ్లికి మా తల్లి తండ్రుల పేరు మీద ఏర్పాటు చేసిన ఆర్బిపి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తే ,మట్టెలు అందజేయడం జరుగుతుంది అని సేవ చేయడంలో తృప్తి ఉంటుందని సంపాదించిన దాంట్లో కొంత సేవ చేయడం జరుగుతుంది అని సేవ చేయడానికి అవకాశం కల్పిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కాగా గ్రామంలో జరిగే ఆడపిల్లల పెళ్లికి మేనమామ లాగా సహాయం అందజేసి ఆశీర్వదిస్తున్న సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ గుప్తాను గ్రామస్తులు అభినందించారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ ఎడపల్లి వెంకటయ్య, కొండపోచమ్మ డైరెక్టర్ మల్లం జానకి రాములు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఎర్రోళ్ల నరేష్ ఏసు దొడ్డి మల్లేష్ తుమ్మ భాస్కర్, బక్కుల సత్తయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు, బలిజగుడం సాయిలు తదితరులు పాల్గొన్నారు