-పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తున్న ఆటో డ్రైవర్ పై కేసు నమోదు.
-పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకుంటే చట్టప్రకారం చర్యలు.
-సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి.
ఈ సందర్భంగా డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…..ఈ రోజు సాయంత్రం ఎల్లారెడ్డిపేట్ కు చెందిన మహమ్మద్ అహమద్ అనే వ్యక్తి తన ఆటో లో టీఎస్. 23. టి.2838 నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి స్కూల్ విద్యార్థులను తన ఆటోలో ఎక్కించుకొని పిల్లలను పడిపోయే విధంగా కూర్చున్న పెట్టుకొని, వారి ప్రాణాలకు నష్టమని తెలిసికూడా విద్యార్థులను అలా ఎక్కించుకొని వెళ్తున్న అట్టి డ్రైవర్ మహమ్మద్ అహమద్ పైన ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను,విద్యార్థులను ఎక్కించుకోవద్దు అని, పరిమితి మించి ఎక్కించుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
