
సిరిసిల్ల లో బస్సులు ఎక్కడ ఆగుతాయో తెలియక అయోమయంలో ప్రజలు
సిరిసిల్ల ప్రయాణ ప్రాంగణం వద్ద రవాణా అస్తవ్యస్తం
ప్రయాణ ప్రాంగణం వద్ద కొనసాగుతున్న డ్రైనేజీ, టాయిలెట్ నిర్మాణ పనులు
TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం వద్ద ఓ వైపు డ్రైనేజీ నిర్మాణ పనులు,మరో వైపు టాయిలెట్స్ నిర్మాణ పనులు కొనసాగుతుండడం తో ప్రజా రవాణా వ్యవస్త అస్తవ్యస్తం అయింది.కొన్ని బస్సులు బస్టాండ్ లోపల ఆపుతుంటే మరి కొన్ని బస్సులు ప్రయాణ ప్రాంగణం వెలుపలే ఆపుతున్నారు.దీంతో ప్రయాణికులకు ఏ రూట్ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగా ఇరువైపులా రోడ్డు పైన వాహనాల పార్కింగ్,పళ్ళ బండ్లు,తోపుడు బండ్లు ఉండగా అక్కడే నిలిచిన బస్సుల్లో ఎక్కడానికి,దిగడానికి ప్రయాణికులు నానా తంటాలు పడుతున్నారు.ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.అలాగే రోడ్ల పై బస్సులు ఆపుతుండడంతో అక్కడే పార్కింగ్ బండ్లు,తోపుడు బండ్లు ఉండడం వల్ల ప్రయాణికుల తో రోడ్డు కిక్కిరిసిపోతుంది.కావున అక్కడ ప్రమాదాలు జరిగే ఆస్కారం కలదు పోలీసులు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.చదువుకున్న వారు సైతం ఏ బస్సు ఎక్కడ ఆగుతుదయ్య అంటూ ఎదురు పడిన వారినల్లా అడగాల్సిన పరిస్థితి దాపురించిందని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ప్రజలకు శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





