సిద్దిపేట్, జులై 9, తెలుగు న్యూస్ 24/7
తేదీ: 09.07.2026 నాడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేట డివిజన్ రవీందర్ గారు తెల్పిన వివరాల ప్రకారం. నిందితులు:1. దొడ్ల వెంకటేష్ తండ్రి రాజమల్లు, వయస్సు: 29 సంవత్సరాలు, కులం: చాకలి, వృత్తి: ట్రావెల్ ఏజెన్సీ, నివాసం: పెద్దగుండవెళ్లి గ్రామం, దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా.2. వన్నెల అశ్విత్ కుమార్ @ బన్నీ, గ్రా: గుర్రాలగొంది, 3. బండి భాను ప్రసాద్ @ దినేష్, గ్రా: బక్రిచెప్యాల, 4. రేఖ భర్త: భాను ప్రసాద్, గ్రా: బక్రిచెప్యాల 5. బురుజుకింది ఈశ్వర్, గ్రా: రామంచ, 6. రాజబోయిన నవీన్ కుమార్, సిద్దిపేట. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దొడ్ల వెంకటేష్ ఎన్సాన్ పల్లి గ్రామనికి చెందిన ఒక యువతిని కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెకు కుటుంబ సభ్యులు రాజన్నజిల్లా తంగళపల్లి గ్రామనికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో, దానిని జీర్ణించుకోలేక ఆమె వివాహం ఆగిపోవాలనే ఉద్దేశంతో ఆమె పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా కుట్ర పన్నాడు.అందులో భాగంగా బాధిత యువతితో తనకు సంబంధం ఉన్నట్లు పేర్కొంటూ, గ్రామ ప్రజలు మరియు వివాహం చేసుకోబోయే వ్యక్తి కుటుంబ సభ్యులలో అపోహలు కలిగించే విధంగా అభ్యంతరకరమైన పోస్టర్లను తయారు చేయించాడు. అనంతరం తన స్నేహితుల సహకారంతో వాటిని ప్రింట్ చేయించి, తేదీ 07.07.2026 నాడు రాత్రి సమయంలో తంగళ్లపల్లి మరియు ఎన్సాన్‌పల్లి గ్రామాలలోని పలు ప్రదేశాలలో పోస్టర్లను అతికించారు.ఈ విషయంపై ఫిర్యాదు అందడంతో సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుల ప్రమేయం బయటపడగా, వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారు. నేరానికి ఉపయోగించిన నిందితుల యొక్క మొబైల్ ఫోన్లు, అందుకు ఉపయోగించిన కారును మరియు గ్రామంలో అతికించిన పోస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మహిళలపై ఎలాంటి వేధింపులు, బెదిరింపులు, అవమానకర చర్యలు లేదా ఇబ్బందులకు పాల్పడినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని ఏసిపి రవీందర్ సూచించారు.





