24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్చ్ 28
సిద్ధిపేట;
ఎన్నికల కోడ్ లో ఉన్న నేపథ్యంలో టి
బిఆర్ఎస్ నాయకులు ఓట్లు దండుకునేందుకు గుర్తు చప్పుడు కాకుండా ముస్లిం ప్రజలకు రంజాన్ తోపాలను పంపిణీ చేస్తున్నారని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆత్తు ఇమామ్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా అధికారులు మాత్రమే ముస్లిం ప్రజలకు రంజాన్ తోఫాలను అందించాలని అన్నారు. గ్రామాలు మండలాల్లో రెవెన్యూ అధికారులు పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ వాడు అధికారులు మాత్రమే అందజేయాలని ఎలాంటి నాయకుల ఫోటోలు పెట్టవద్దని అన్నారు. కొందరు తంజీం నాయకులు బిఆర్ఎస్ నాయకుల ఫోటోలు పెట్టి గుట్టు చప్పుడు కాకుండా టోకెన్లు అందిస్తూ రంజాన్ తోఫాలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు రంజాన్ తోపాలు అందించడంలో మేము వ్యతిరేకం కాదని వాటిని టిఆర్ఎస్ నాయకులు అందజేయడమే తప్పుగా భావిస్తున్నామని అన్నారు. ఇకనైనా ఎన్నికల అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గయాజుద్దీన్ ఎన్ఎస్ యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ రషడ్. అనిల్ చోటు తదితరులు పాల్గొన్నారు
