Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

రైస్ బ్యాగ్ పంపిణిలో రాజునాయక్ సేవలు బేష్..

63 Views

రైస్ బ్యాగ్ పంపిణిలో రాజునాయక్ సేవలు హర్షనీయం

రాజన్న జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు బానోత్ రాజునాయక్ సేవాదాయకమైన ఆలోచన వల్ల పార్టీలు, కులంతో వర్గాలతో సంబంధం లేకుండా రైస్ బ్యాగ్ పంపిణి చేస్తున్నారు. అంతే కాదు రైస్ బ్యాగ్ ఇచ్చే టప్పుడు సామాజిక కార్యకర్తగా ఇస్తాడు. గుండారం గ్రామంలో ఎవరు చనిపోయిన బియ్యం పంపిణి చెయ్యడం దానితో పాటు వినాయక చవితిలకు, దుర్గ మాత, శ్రీరామ నవమి వద్ద అన్న ప్రసాదం కోసం బియ్యం పంపిణి చెయ్యడం హర్షించదగ్గ విషయం ఇప్పటి వరకు 113 రైస్ బ్యాగ్ పంచారు. ఎన్నో కష్ట నష్టాలు భరించి , అవమానాలు దిగమింగి గ్రామ ప్రజలకు భూములు ఇప్పించాలని దృఢ సంకల్పంతో తన అశయ సాధన కోసం దేశ ద్రోహం లాంటి కేసులలో జైలుకు వెళ్ళాడు. అనేక రాజకీయ విమర్శలు ఎదురుకునే రాజునాయక్ నిరంతరం ప్రజలతోనే మమేకం అయి ఉంటారు. రాబోయే రోజులో తన రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి…

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్